న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదానంలో నవంబర్ 1న తలపెట్టిన నిరసన ర్యాలీని వాయిదా వేసుకోవాలంటూ ఢిల్లీ వ్యాపారులు ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలను కోరారు. ర్యాలీని నవంబర్ 10 తర్వాత నిర్వహించేలా కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రతినిధులు ఈ విషయంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో వారు అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ థాక్రే తదితర ఇండియా కూటమి నేతలకు లేఖలు రాశారు. దివాళీ సీజన్ వ్యాపారానికి ఎంతో కీలకమైనదని, ఈ ర్యాలీ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్, ఓల్డ్ ఢిల్లీ పరిధిలోని దాదాపు 20 ప్రధాన హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో ప్రతిరోజూ రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందన్నారు.
ఈ సీజన్ ముగిసే వరకూ ర్యాలీని వాయిదా వేయాలని, లేదా 15 వేల వాహనాలకు పార్కింగ్ వసతి ఉన్న బురారీ గ్రౌండ్స్‌కు మార్చాలని ట్రేడర్లు రిక్వెస్ట్చేశారు.
