టెహ్రాన్: ఇరాన్‌పై మళ్లీ దాడిచేస్తే క్షణం కూడా ఆలోచించకుండా ప్రతిదాడులు చేస్తామని ఆ దేశ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. ఈసారి యుద్ధం మీరు మొదలు పెడితే ముగింపు తాము పలుకుతామని అన్నారు. ప్రతిదాడులకు ఎలాంటి పరిమితులు, ఆంక్షలను లెక్కచేయబోమని అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినా, ఏదైనా ఉగ్రదాడి జరిగినా.. అది ఏ దేశం, ఏ ప్రాంతమనేది చూడకుండా తీవ్ర స్థాయిలో బదులివ్వాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ రెండు దేశాల ఆస్తులను టార్గెట్ చేయాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) కి ఖమేనీ సూచించారు. మందుగుండు సామగ్రి, ఆయుధాల ఉత్పత్తి పెంచాలని, సైనిక నిఘాను బలోపేతం చేయాలని, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
