ముంబై: మొబైల్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ సౌకర్యం మాత్రమే కోరుకునే వినియోగదారుల కోసం టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొత్త ‘వాయిస్- ఓన్లీ’ ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రాయ్ గత నెలలో జారీ చేసిన ఆదేశాల మేరకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.147 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ప్లాన్లలో దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాలింగ్‌తో పాటు ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. వీటి వ్యాలిడిటీ 22 రోజుల నుంచి 336 రోజుల వరకు ఉంది.
ప్లాన్ల వివరాలు..
రూ.147 ప్లాన్‌లో 22 రోజులు వ్యాలిడిటీ, 300 ఫ్రీ ఎస్ఎంఎస్లు వస్తాయి. 28 రోజుల వ్యాలిడిటీ, 300 ఎస్ఎంఎస్లతో రూ.177 ప్లాన్‌ను తీసుకొచ్చారు. 30 రోజుల వ్యాలిడిటీతో రూ.196 ప్లాన్, పూర్తి క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో రూ.197 ప్లాన్ అందుబాటులో ఉన్నాయి. 300 ఫ్రీ ఎస్ఎంఎస్లు పొందొచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ, 1,000 ఎస్ఎంఎస్లతో రూ.448 ప్లాన్, 336 రోజుల వ్యాలిడిటీ, 3,600 ఎస్ఎంఎస్లతో రూ.1,748 ప్లాన్ అందుబాటులోకి వచ్చాయి.
వీటితో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సదుపాయం కూడా లభిస్తుంది. ఈ ప్లాన్లలో మొబైల్ డేటా లభించదు. సాధారణ 28 రోజుల డేటా ప్లాన్‌తో (రూ.189) పోలిస్తే రూ.177 ప్లాన్ వల్ల రీఛార్జ్ ఖర్చు తగ్గుతుంది. కేవలం ఇన్ కమింగ్ కాల్స్, ఓటీపీల కోసం సెకండరీ సిమ్ వాడేవారికి, ఇంట్లో లేదా ఆఫీసులో వైఫైపై ఆధారపడేవారికి, స్మార్ట్‌ఫోన్ వాడని వృద్ధులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ఈ ప్లాన్లు ఎంతో ప్రయోజనకరం. ఇప్పటికే ఎయిర్టెల్, వీఐ కూడా కేవలం వాయిస్ ప్లాన్లను తీసుకొచ్చాయి.
