దేశీయ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ.. వరి కోసం పయోక్సాజోన్ పరుగుల మందు

దేశీయ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ.. వరి కోసం పయోక్సాజోన్ పరుగుల మందు

హైదరాబాద్​, వెలుగు: తొలిసారిగా దేశీయ శాస్త్రవేత్తలు కనుగొన్న సరికొత్త ఇన్సెక్టిసైడ్ మాలిక్యూల్ పయోక్సానిలిప్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపొందించిన పయోక్సాజోన్ పురుగుమందును పీఐ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం విడుదల చేసింది. వరిలో కాండం తొలిచే పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగు, శనగ పంటలో కాయతొలిచే పురుగులను నివారించేందుకు దీనిని ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. 

సెంట్రల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెక్టిసైడ్స్ బోర్డ్ నుంచి అనుమతి పొందిన ఈ మందు స్ప్రే చేసిన 30 నిమిషాల్లోనే మొక్కల్లోకి వేగంగా ఇంకిపోతుంది. వర్షం పడినా దీని ప్రభావం తగ్గకుండా పంటలకు దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. మిత్రపురుగులైన సాలీళ్ళు, లేడీబర్డ్ బీటిల్స్ వంటి వాటికి ఎలాంటి హాని కలిగించకుండా పర్యావరణహితంగా పనిచేస్తుంది. ఒక పంటకు 400 మిల్లీలీటర్ల మందును పిచికారీ చేయాలి.  

 ఈ పంటలకు ఉపయోగం..

పసుపు కాండం తొలిచే పురుగు, ఆకు ముడుత పురుగు
మొక్కజొన్న లో కత్తెర లద్దెపురుగు
శనగ: కాయ తొలిచే పురుగు
కూరగాయల పంటలైన మిరప, టమాటాల్లో వచ్చే కాయతొలిచే పురుగుల
పైనా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.