ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో ‘మైలురాయి’ పోస్టర్ రిలీజ్ 

ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథతో ‘మైలురాయి’ పోస్టర్ రిలీజ్ 

జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా, దేవీ ప్రసాద్ కీలకపాత్రలో రఘువర్ధన్ కోట్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘మైలురాయి’.  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను నాగబాబు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘టైటిల్‌‌‌‌ ఆసక్తికరంగా ఉంది. నిర్మాతలుగా రాణిస్తున్న అశ్వనీదత్‌‌‌‌ గారి అమ్మాయిలు  స్వప్న దత్, ప్రియాంక దత్, నా  కూతురు నిహారిక, సుప్రియ యార్లగడ్డ బాటలో ఈ చిత్ర నిర్మాత హన్సిక విజయాలు అందుకోవాలి’ అని బెస్ట్ విషెస్ చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిందని, త్వరలో టీజర్‌‌‌‌‌‌‌‌, పాటలు విడుదల చేస్తామని నిర్మాత హన్సిక చెప్పారు. భావోద్వేగాలతో కూడిన ఈ ప్రేమకథ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు చెప్పాడు.  హీరో జగన్ యోగిరాజు,  కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌ తవిటిరాజు తదితరులు పాల్గొన్నారు.