శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (56), ప్రముఖ జర్నలిస్ట్ నిధి రజ్దాన్ (49) వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం ఆయనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. శ్రీనగర్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల నుంచి కొద్ది మంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, మోల్లీ అబ్దుల్లా దంపతులతో పాటు ఒమర్ అబ్దుల్లా ముగ్గురు సోదరీమణులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిధి రజ్దాన్ తల్లిదండ్రులు, దిగ్గజ జర్నలిస్ట్ ఎం.కె. రజ్దాన్, సార్లా రజ్దాన్ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
