ఢాకా: చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో బ్రెండన్ కింగ్ (81 నాటౌట్) , జాన్ క్యాంప్‌బెల్ (49) రాణించడంతో.. బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ 1–0 ఆధిక్యంలో నిలిచింది. బంగ్లా నిర్దేశించిన 170 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 35.1 ఓవర్లలో 170/2 స్కోరు చేసి నెగ్గింది. కింగ్, క్యాంప్‌బెల్ తొలి వికెట్‌కు 112 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు.
చందర్‌పాల్ (1) ఫెయిలైనా.. కావెమ్ హోడ్జ్ (31 నాటౌట్) మెరుగ్గా ఆడాడు. అంతకుముందు 79/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 48.4 ఓవర్లలో 142 రన్స్‌కే ఆలౌటైంది. నయీమ్ హసన్ (52) టాప్ స్కోరర్. జోమెల్ వారికన్ 4, రోస్టన్ ఛేజ్ 5 వికెట్లు తీశారు. మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన వారికన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్ గురువారం నుంచి సిల్హెట్‌లో జరుగుతుంది.
