కేప్ టౌన్: బౌలింగ్‌లో సిమోన్ హార్మర్ (6/16), కగిసో రబాడ (3/39) దుమ్మురేపడంతో.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్‌లో సౌతాఫ్రికా 176 రన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీలు 2–1తో సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికా నిర్దేశించిన 288 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం ఆఖరి రోజు బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 111 రన్స్‌కే కుప్పకూలింది.
నాథన్ లైయన్ (33 నాటౌట్) టాప్ స్కోరర్. రబాడ, హార్మర్ రెండు వైపుల నుంచి చేసిన బౌలింగ్ దాడిలో కంగారూలు బ్యాట్లు ఎత్తేశారు. కామెరూన్ గ్రీన్ (27), ట్రావిస్ హెడ్ (14), కమిన్స్ (11)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా రబాడ వరల్డ్ రికార్డు సృష్టించాడు. టెస్ట్‌ల్లో అతి తక్కువ బాల్స్ (13, 808)లో 350 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. డేల్ స్టెయిన్ (14,719)ను అధిగమించాడు. రబాడ 75వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘనత అందుకోగా, రిచర్డ్ హ్యాడ్లీ, స్టెయిన్ (69), డెన్నిస్ లిల్లీ (70), మెక్‌గ్రాత్ (74) ముందున్నారు. హార్మర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, యాన్సెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
