హైలొ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్..

హైలొ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు, లక్ష్యసేన్..

సారాబ్రూకెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు.. హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండోసీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింధు 21–13, 21–16తో ఇండియాకే చెందిన అన్మోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖర్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. రెండు వారాల్లో  సింధుకు ఇది వరుసగా రెండో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కావడం విశేషం. మ్యాచ్ ఆరంభం నుంచే  బలమైన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలతో చెలరేగిన  తెలుగమ్మాయి 38 నిమిషాల్లోనే ప్రత్యర్థికి చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టింది.

సింధు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద కచ్చితమైన షాట్లు కొట్టడంతో ఖర్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఒత్తిడిలోకి లోనైంది. అయినప్పటికీ రెండు గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ స్వల్ప ఆధిక్యంలో నిలిచినా చివరి వరకు దాన్ని కాపాడుకోలేకపోయింది. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15–13తో లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న దశలో సింధు కొట్టిన స్మాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీయలేకపోయింది. దాంతో స్కోరు 15–15తో సమమైంది. ఇక్కడి నుంచి తెలుగమ్మాయి వరుసగా పాయింట్లు గెలిచి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21–17, 21–13తో టోమా జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొపోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాడు.