వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడిస్తారా? ఇవాళ(నవంబర్ 1)న్యూజిలాండ్ తో ఐదో టీ20 మ్యాచ్

వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆడిస్తారా? ఇవాళ(నవంబర్ 1)న్యూజిలాండ్ తో ఐదో టీ20 మ్యాచ్
  •     కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!
  •     మ. 12.30 నుంచిసోనీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హామిల్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: నాలుగో టీ20ల్లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా.. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐదో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం తుది జట్టులో కొన్ని వ్యూహాత్మక మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూర్పుపై నమ్మకంతో ఉన్నప్పటికీ నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓటమి మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలోచనలను మార్చేసింది. ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల  సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 3–1 ఆధిక్యంలో ఉన్నా.. చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓటమితో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించాలని ఇండియా అసలు కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీని మళ్లీ జట్టులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఒకవేళ అతనికి చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తే శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు.

ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో  67, 14, 18, 4 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే చేశాడు. దాంతో కొద్దిగా విరామం ఇస్తే మళ్లీ గాడిలో పడతాడని భావిస్తున్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ బాగున్నా.. వ్యక్తిగత పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏమాత్రం బాగా లేదు. టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన తొలి సెంచరీ సాధించిన తర్వాత ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 40, 1, 16, 22, 42, 7, 5, 22 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా ప్రభావం చూపించాల్సిన ఒత్తిడి  శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివర్లో నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నితీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆడటంతో శ్రేయస్ వైఫల్యాలు బయటకు రాలేదు. టీమిండియా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ లోపాలు కనిపిస్తున్నాయి.  భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినా ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో ఇండియా ఎక్కువగా అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆధారపడాల్సి వస్తోంది. నితీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత మెరుగుపడాలి. కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తిలో ఒకర్ని తీసుకోవాలంటే నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కనబెట్టాల్సి ఉంటుంది.

తుది జట్లు (అంచనా)

ఇండియా: శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ, శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / వైభవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ, ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ, నితీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ / అర్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మయాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: శాంట్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఫెర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డారిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాకబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మైకేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్నే, జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డఫీ, మ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 

గెలుపే లక్ష్యంగా.. 

తొలి మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఘోరంగా ఓడిన న్యూజిలాండ్ నాలుగో టీ20లో తమ సత్తా ఏంటో చూపెట్టింది. ఇప్పుడు కూడా అదే బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని భావిస్తోంది. విజయంతో ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముగించి ఆత్మవిశ్వాసంతో వన్డేలను మొదలుపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మరింత లోతుగా పరిశీలించుకునేందుకు రెండు జట్లకు వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా కీలకం కానుంది. గ్లెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డారిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిచెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. నాలుగో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడిన జట్టునే యధావిధిగా బరిలోకి దించే అవకాశం ఉంది.