- జాబితా విడుదల చేసిన హోంశాఖ
- సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా
- జాబితా విడుదల చేసిన హోంశాఖ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన 24 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన ‘కేంద్ర గృహమంత్రి దక్షతా పతకాలు–2026’ దక్కాయి. శనివారం సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్, కేంద్ర పోలీస్ సంస్థల (సీపీవో) నుంచి మొత్తం 490 మందికి ఈ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని కేంద్రం ఈ పతకాలతో గుర్తించింది.
ఎంపికైంది వీరే.. స్పెషల్ ఆపరేషన్ ఫీల్డ్
ఇన్స్పెక్టర్లు: అలేటి అన్వేశ్ రెడ్డి, వూలిసే నరేందర్, పిడమర్తి వీరబాబు
సబ్ ఇన్స్పెక్టర్లు : కనుకుంట అరుణ్, యమాని ఆంజనేయులు
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: ఎన్. హన్మంత్ గౌడ్
హెడ్ కానిస్టేబుళ్లు : ఎం. ఫ్రాన్సిస్ లాజరస్, ఎస్.రతన్ కుమార్, మొహ్సిన్ అహ్మద్, తుమ్మల లక్ష్మణ్, పొగాకు రవీందర్, ఉప్పునూతల జంగయ్య, బుర్రి నరసింహా రెడ్డి, ఎండీ షబీర్
కానిస్టేబుళ్లు : ఆర్. మహేందర్ సింగ్, బండారి నవీన్ కుమార్, మొహమ్మద్ అబ్దుల్ కలీం, రాపోలు లక్ష్మణ్, యుల్లెందుల రాజేశ్, నదీమ్ మోహియుద్దీన్, మహమ్మద్ ఖాజా పాషా,దర్యాప్తు విభాగం ఇన్స్పెక్టర్లు
(తెలంగాణ): సాయిని శ్రీనివాసరావు, కె.నవీన్‌కుమార్, కాసర్ల శశిధర్
