కూకట్ పల్లి, బాలానగర్ బియ్యం షాపుల్లో తనిఖీలు

కూకట్ పల్లి, బాలానగర్ బియ్యం షాపుల్లో తనిఖీలు
  • అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తింపు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి, బాలానగర్​లోని పలు బియ్యం షాపుల్లో సివిల్​సప్లై, లీగల్​ మెట్రాలజీ, సివిల్​సప్లై​టాస్క్​ఫోర్స్ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టారు. అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు, 26 కిలోల రైస్ బ్యాగుల్లో 25 కిలోల బియ్యమే ఉన్నట్లు, పలువురు జీఎస్టీ కూడా చెల్లించడం లేదని గుర్తించారు. బాలానగర్​పరిధిలోని ఫిరోజ్​గూడ హనుమాన్​ ట్రేడర్స్, కూకట్​పల్లి అడ్డగుట్ట సొసైటీలోని వజ్రతేజ రైస్​ ట్రేడర్స్​తదితర దుకాణాల్లో మోసాలు బయటపడ్డాయి. 

తప్పుడు లెక్కలు, అధిక ధరలతో ప్రజలను మోసం చేస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. మరోసారి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.