‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మెప్పించిన దర్శకుడు శ్రీధర్ గాదె.. ఈసారి ఓ హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ చిత్రాన్ని ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. శనివారం డైరెక్టర్ శ్రీధర్ గాదె బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘కొరివి’ అనే టైటిల్‌ను ఖరారు చేయడంతో పాటు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
మాయానది అనే ప్రాంతంలోని నిధికి కాపు కాసే ఓ కొరివి దెయ్యం కథ ఇదని, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఉండబోతోందని గ్లింప్స్‌లో చూపించారు. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచిరాజు హీరోగా నటిస్తుండగా, నందు మురళీధర్, లిఖిత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
