సిద్ధు రెడ్డి కందకట్ల లీడ్‌గా నటిస్తూ నిర్మించిన ఆల్బమ్ సాంగ్ ‘ఓ నా సిద్ధయ్య’. కాత్యాయని జగన హీరోయిన్. రామ్ అద్నాన్ లిరిక్స్ రాయడంతోపాటు డైరెక్షన్ చేశాడు. ఈ సాంగ్‌ను శంషాబాద్‌లోని స్కూల్ ఆవరణ అవుట్‌డోర్‌లో 70 ఎంఎం భారీ స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో విడుదల చేశారు.
నటుడు సోనూసూద్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ అతిథులుగా పాల్గొని పాటను విడుదల చేసి సిద్ధయ్య టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో ఇంద్రరామ్, సింగర్స్ బోలే షావలి, నల్గొండ గద్దర్ నరసన్న, నటుడు ఉత్తేజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలను పల్లెటూరి నేపథ్యంలో ఆవిష్కరించిన ఈ పాటలో దాంపత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలను నేచురల్‌గా చూపించారు.
