‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ చిత్రానికి అద్భుతమైన స్పందన ఇస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు వెంకటేష్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 30న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలని నిజాయితీతో కొత్త జానర్ ట్రై చేశాం. కుటుంబ ప్రేక్షకులకు ఎప్పుడూ మంచి సినిమా ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను. వారికి సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది.
ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు. తన పాత్రకు మంచి అప్లాజ్ రావడం హ్యాపీగా ఉందని శ్రీనిధి శెట్టి చెప్పింది. ప్రేక్షకులు తమకు చాలా ఆనందాన్ని ఇచ్చారని, చాలామంది ఫోన్లు చేసి ఇంటర్వెల్ గురించి మాట్లాడుతుంటే మరింత సంతోషంగా అనిపించిందని దర్శకుడు త్రివిక్రమ్ చెప్పారు. ఈ సినిమా షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయని నిర్మాత చినబాబు అన్నారు. నటీనటులు రావు రమేష్, నివేదా పేతురాజ్, సత్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొని ఈ సక్సెస్‌లో భాగమవడం సంతోషంగా ఉందని అన్నారు.
