న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఢిల్లీ మార్కెట్లో శనివారం 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.3,200 తగ్గి రూ.1.42 లక్షలకు చేరుకుంది. 2025 డిసెంబర్ తర్వాత బంగారం ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. వెండి ధర కూడా కిలోకు రూ.4,200 తగ్గి రూ.1.86 లక్షలకు దిగివచ్చింది. సెప్టెంబర్ నెలాఖరుతో పోలిస్తే అక్టోబర్లో బంగారం ధర రూ.7,300, కిలో వెండి ధర ఏకంగా రూ.46 వేల మేర తగ్గింది. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం వంటివి ఈ పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున కొనుగోళ్లు పెరిగి ధరలకు కొంత మద్దతు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
