హైదరాబాద్, వెలుగు: దీపావళి వేళ వ్యాపార సంస్థల కోసం అమెజాన్ బిజినెస్ ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఆఫీస్ ఫర్నిచర్, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఏసీలు, స్టేషనరీపై 84 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. భారీ కొనుగోళ్లపై మరో 11 శాతం వరకు బల్క్ డిస్కౌంట్లు ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు రూ.9,999 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
హెచ్‌పీ, డెల్ గేమింగ్, ఆఫీస్ ల్యాప్‌టాప్‌లపై 33 శాతం వరకు డిస్కౌంట్పొందవచ్చు. శాంసంగ్ 55 ఇంచుల మినీ ఎల్ఈడీ టీవీ రూ.40,245, షియోమీ 55 ఇంచుల ఫైర్ టీవీ రూ.30,083 కు లభిస్తున్నాయి. గోద్రెజ్, లాయిడ్ ఇన్వర్టర్ ఏసీలపై 49 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఎర్గోనామిక్ ఆఫీస్ కుర్చీలు, నోట్ల లెక్కింపు యంత్రాలు, డెస్క్ ల్యాంప్‌లను వ్యాపారులు తక్కువ ధరలకే కొనచ్చని అమెజాన్ తెలిపింది.
