నవంబర్ 13న ‘ఇట్లు అర్జున’ విడుదల..

నవంబర్ 13న ‘ఇట్లు అర్జున’ విడుదల..

అనీష్, అనస్వర రాజన్ జంటగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’.  నాగార్జున సమర్పణలో   మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం సరైన రిలీజ్ డేట్ దొరక్క పోస్ట్​పోన్‌‌‌‌ అవుతూ వచ్చింది.  ఫైనల్‌‌‌‌గా నవంబర్ 13న  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా  విడుదల చేసిన పోస్టర్  ఆకట్టుకుంటోంది.  

భారీ క్యాలెండర్‌‌‌‌పై హీరో అనీష్, హీరోయిన్ అనస్వర రాజన్ పక్కపక్కనే కూర్చున్న ఈ స్టిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో  అర్జున్ అనే మూగ యువకుడిగా అనీష్ కనిపించనున్నాడు.  అర్జున్ తన జీవితమంతా కీర్తిని (అనస్వర)  మౌనంగా ప్రేమిస్తుంటాడు. అతని ప్రయాణం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ప్రేమ, హాస్యం, సాహసం, ఊహించని ట్విస్టులతో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని  ఇస్తుందని మేకర్స్ తెలియజేశారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.