ఈవారంలో ( నవంబర్ 1–7) రమా ఏకాదశి, ధన త్రయోదశి లాంటి పవిత్రమైన రోజులున్నాయి. ఈ వారం చివరిలో శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. గ్రహాల సంచారం ఆధారంగా వ్యాపారం, వృత్తి, ఉద్యోగాలు, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఫలితాలున్నాయి? ఈ వారం ( నవంబర్ 1–7) ఏ రాశి వారికి ఎలా ఉంటుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. . !
మేషరాశి: ఈ వారం ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్నా ఉన్నత పదవుల మీద ఆశ ఎక్కువగా ఉంటుంది.ఇతరులకు భిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. పాలన, ప్రజా సంబంధాలు, సేవా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది వీరి కోరిక.ఆర్థిక లావాదేవీల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లను ఆకర్షించి, తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు మీ మనోధైర్యాన్ని పెంచుతుంది..నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభరాశి: ఈ రాశి వారికి ఈ వారం శని... కుజుడు అనుగ్రహం వలన అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగాగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు సంతృప్తి కరంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో పెద్దలను సంప్రదించాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ, పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తగిన గుర్తింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. . శత్రువులు మిత్రులుగా మారతారు. కొత్తగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వారం మొదట్లో డబ్బు అధికంగా ఖర్చుఅవుతుంది. ప్రేమ వ్యవహారాలు వాయిదా వేసుకోండి. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. వారం మధ్యలో కొద్దిగా ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
కర్కాటకం : ఈ రాశి వారికి ఈ వారం మనసులోని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులు బిజీ అవుతారు.సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో ఉన్న ఆస్తుల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో భూమి.. ఇల్లు.. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థంగా లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదావేసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోండి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. . .
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు బాగా కలసి వస్తాయి. బంధువుల వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు.వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుముఖంపడతాయి. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు. గతంలో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు నిదానంగా, నిలకడగా కొనసాగుతాయి.
కన్యారాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయ త్నాలు లాభాలను తెచ్చిపెడతాయి. వృత్తి, ఉద్యో గాల్లో ఆర్థికంగా అధిక ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పూర్వీకులు దాచిన డబ్బు చేతికి అందడంతో... అప్పుల బాధలు తొలగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు.వివాహ ప్రయత్నాలు ఫలించి పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా ముందుకు సాగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.
తులారాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా హ్యాపీగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. బంధువుల నుంచి శుభ కార్యాల ఆహ్వా నాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రాజెక్టులు, కొత్త కార్యక్రమాలు వియవంతమ వుతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు సజావుగా సాగిపో తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
వృశ్చికరాశి: ఈ రాశి వారు ఈ వారం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. అయితే వారం చివరిలో ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.వ్యాపార రంగంలో చాలా కొద్దిగా లాభాలుంటాయి. సీజన్ వ్యాపారస్తులకు.. చేతి వృత్తి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. ఎవరితోనూ వాదన పెట్టుకోవద్దు..జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ప్రేమికులు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోండి.
ధనుస్సురాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. కన్యా రాశి వారు ఈ వారం గుళ్లు... గోపురాలు దర్శిస్తారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో బాగా ప్రయోజనం పొందుతారు. గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి.పెళ్లి సంబంధం చేసేవారు వారం చివరిలో గుడ్ న్యూస్ వింటారు.కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. ఆస్తి వివాదం విషయంలో కీలక సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
మకరరాశి: ఈ రాశి వారు ఈ వారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు, కార్యకలా పాలు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సజావుగాసాగుతాయి.
కుంభరాశి: ఈ రాశి వారు ఈ వారం చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులుఅనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.ప్రేవైటు సంస్థల్లో పనిచేసే వారి ప్రతిభను గుర్తిస్తారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రేమ.. పెళ్లి విషయాలు సానుకూలంగా ఉంటాయి.
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం కొత్త ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. బంధువులు.. స్నేహితులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి.వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా పురోగ మిస్తాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో భారీ లక్ష్యాలతో ఇబ్బంది పడతారు. ప్రేమ విషయాలను వాయిదా వేసుకోండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
