- పాలమూరు జిల్లాకు కేసీఆర్ అన్యాయం చేసిండు: ఎంపీ డీకే అరుణ
కొడంగల్, వెలుగు: ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఓట్చోరీ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ డీకే అరుణ ఫైర్అయ్యారు. శనివారం ఆమె వికారాబాద్‌జిల్లా కొడంగల్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నిజంగా ఓట్చోరీ జరిగితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదని కామెంట్ చేశారు. ఓట్చోరీ పేరుతో రాహుల్‌గాంధీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూములమ్మి రాష్ట్రాన్ని నడుపుతామనడం సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనమని విమర్శించారు.
ఢిల్లీకి మూటలు పంపడం ఆపేస్తే రాష్ట్ర అభివృద్ధికి నిధులు సరిపోతాయని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి కేసీఆర్ పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేసిండని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహిస్తున్న మహాపాదయాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు రతంగ్ పాండు రెడ్డి, శ్రీనివాస్, సత్యయాదవ్, పున్నంచంద్లాహోటి, ప్రతాప్‌రెడ్డి, బస్వరాజ్, మురళిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
