- కుటుంబ కలహాలే కారణం
- కొత్తపేట సత్యానగర్ కాలనీలో ఘటన
దిల్ సుఖ్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తపేట సత్యానగర్ కాలనీలో కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన భర్తను కత్తితో పొడిచి చంపింది. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరంగల్‌కు చెందిన కొంతం ప్రభాకర్ (55) భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. అనారోగ్యం కారణంగా ప్రభాకర్సెక్యూరిటీ గార్డు పని మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. రజిత తీవ్ర ఆగ్రహంతో కత్తితో ప్రభాకర్ఛాతిలో పొడిచింది.
తీవ్రంగా గాయపడిన అతన్ని కుమార్తెలు అంబులెన్స్‌లో దవాఖానకు తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సైదులు పేర్కొన్నారు.
