జలంధర్: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ఇండియాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా.. ఆదివారం జరిగే నాలుగో మ్యాచ్‌లో మలేసియాతో తలపడనుంది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల ఫైనల్లో ఇండియా 5–1తో మలేసియాను ఓడించడం కలిసొచ్చే అంశం. అయినప్పటికీ ఏ అంశంలోనూ మలేసియాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బంగ్లాదేశ్, చైనాపై ఈజీగా నెగ్గిన ఇండియాకు.. జపాన్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి మూడు క్వార్టర్లలో ఒక్క పెనాల్టీ కార్నర్ కూడా రాకపోవడంపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ ఆందోళన వ్యక్తం చేశాడు.
జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫార్వర్డ్ ప్లేయర్ అభిషేక్ నైన్ రెండు అద్భుతమైన ఫీల్డ్ గోల్స్ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే డిఫెన్స్‌లో సంజయ్ మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన స్ట్రయికర్ మన్‌దీప్ సింగ్ ఈ మ్యాచ్‌లో ఆడే చాన్స్ ఉంది. మరోవైపు మలేసియా కూడా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మలేసియా.. ఇండియా తర్వాతి ప్లేస్‌లో ఉంది. బలమైన ఫార్వర్డ్ లైన్‌కు డిఫెన్స్ కూడా అండగా నిలిస్తే ఇండియాను అడ్డుకోవచ్చు.
