కొడంగల్, వెలుగు: వికారాబాద్‌జిల్లా కొడంగల్ కేజీబీవీలో ఓ విద్యార్థిని హాస్టల్ బిల్డింగ్‌పైనుంచి పడి తీవ్రంగా గాయపడింది. ఇంటర్సెకండియర్చదువుతున్న కోస్గి మండలం తోగాపూర్ గ్రామానికి చెందిన గాయత్రి శుక్రవారం సాయంత్రం హాస్టల్సెకండ్ఫ్లోర్లో ఆరేసిన దుస్తులను తెచ్చుకునేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరగగా.. వెన్నెముకకు తీవ్ర గాయమైందని ఎంఈవో రాంరెడ్డి శనివారం తెలిపారు. బాధితురాలికి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఒక్కగానొక్క కూతురికి ఇలా జరగడంతో గాయత్రి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై తమకు అనుమానం ఉందని బాధితురాలు తండ్రి నర్సింహులు గౌడ్‌తెలిపారు.
