నార్సింగి రోడ్డు అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ను పున:పరిశీలించాలి : మాజీ మంత్రి హరీశ్రావు

నార్సింగి రోడ్డు అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ను పున:పరిశీలించాలి :  మాజీ మంత్రి హరీశ్రావు

గండిపేట, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నార్సింగిలో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డు అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ను ప్రభుత్వం పున:పరిశీలించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​చేశారు. కొత్త అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్ కారణంగా సెవెన్ హిల్స్, వెస్ట్రన్ మిడోస్ కాలనీల్లో ఇళ్లకు రెడ్ మార్కింగ్‌‌‌‌‌‌‌‌లు వేయడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో శనివారం ఆయా కాలనీల్లో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం రోడ్డు అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను మార్చి మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రెడ్ మార్కింగ్‌‌‌‌‌‌‌‌లు వేయడం సరికాదన్నారు. 2018లో జీవో 181 ద్వారా రూపొందించిన అలైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను మార్చడం వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్​ఎస్​రాజేంద్రనగర్​ఇన్​చార్జి కార్తీక్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.​