కేసీఆర్ భూములు అమ్మితే.. రేవంత్ రక్షించారు :మల్లు రవి

కేసీఆర్ భూములు అమ్మితే.. రేవంత్ రక్షించారు :మల్లు రవి
  • మియాపూర్ భూముల వ్యవహారంలో హరీశ్ రావుకు మల్లు రవి కౌంటర్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్‌‌ఎస్ హయాంలో కేసీఆర్‌‌ రాష్ట్రంలోని విలువైన భూములను అమ్మేశారని.. కానీ, సీఎం రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌‌ ప్రభుత్వం ఖరీదైన భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. మియాపూర్ భూములను తామే పరిరక్షించామని బీఆర్ఎస్ నేత హరీశ్‌‌రావు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, గత ప్రభుత్వమే అక్రమణదారులకు అండగా నిలిచిందని మండిపడ్డారు.

ఈ మేరకు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదులతో బలమైన వాదనలు వినిపించి సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములను రక్షించిందని తెలిపారు. గతంలో దళిత సీఎం, డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్ల పేరుతో కేసీఆర్‌‌ పేదలను మోసం చేశారని మల్లు రవి ఆరోపించారు.