హైదరాబాద్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎల్ఎల్బీ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన చంద్రకళ అనే యువతి శాతవాహన యూనివర్శిటీలో ఎల్ఎల్బీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం (నవంబర్ 1) క్యాంపస్ హాస్టల్లో చంద్రకళ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.
గమనించిన విద్యార్థులు వర్శిటీ సిబ్బందికి సమాచారం అందించగా అధికారులు స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. వర్శిటీ సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. చంద్రకళ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి ఫోన్ ను పరిశీలిస్తోన్న పోలీసులు.. చివరగా ఎవరితో కాల్ మాట్లాడిందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
