19 ఏళ్ల కుర్రాడు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో.. రూ.60 లక్షల విలువైన దొంగ నోట్లతో దొరికాడు !

19 ఏళ్ల కుర్రాడు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో.. రూ.60 లక్షల విలువైన దొంగ నోట్లతో దొరికాడు !

సికింద్రాబాద్: జైపూర్ నుంచి ముంబైకి నకిలీ కరెన్సీ నోట్లను రవాణా చేస్తున్న నకిలీ భారతీయ కరెన్సీ స్మగ్లర్‌ను సికింద్రాబాద్ జీఆర్‌పీ, ఆర్‌పిఎఫ్ (బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్) పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 60 లక్షల- విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. 

సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), RPF సంయుక్తంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, రైళ్లపై స్మగ్లర్లు, మోడ్ నేరస్థులు, అనుమానితులపై ఆకస్మిక తనిఖీలు చేశారు.

ఈ క్రమంలోనే ఈ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను రవాణా చేస్తున్న నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.10 దగ్గర ఉన్న రైలు నెం.18519 ముంబై ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో పట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన శివరతన్ మహియా(19)ను అరెస్టు చేయగా, ఓం ప్రకాష్ (25)పరారీలో ఉన్నాడు.