బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. అభిమానులతో తనకున్న అనుబంధానికి మరోసారి ప్రాధాన్యమిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆదివారం ఫ్యాన్స్ మీట్‌ను ఈసారి కూడా మిస్ కాకుండా నిర్వహించారు. అయితే గత పరిస్థితులకు భిన్నంగా, ఈసారి భారీ భద్రత మధ్య అభిమానులను కాలిసారు అమితాబ్. ఏకంగా బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ రక్షణతో అభిమానులను పలకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు అమితాబ్ భద్రతను ఎందుకు పెంచారు? ఈ ప్రత్యేక రక్షణ ఏర్పాటు వెనుక కారణమేంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ముంబైలోని తన నివాసం ‘జల్సా’కు ఇటీవల బాంబు బెదిరింపు రావడంతో అమితాబ్ బచ్చన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నవంబర్ 1న అభిమానులకు అభివాదం చేసిన సమయంలో అమితాబ్ పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ రక్షణ వెనుక కనిపించారు. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా అక్కడే ఉండటంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ వెనుక బిగ్‌బీ..
సాధారణంగా ప్రతి ఆదివారం జల్సా వెలుపలకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడం అమితాబ్ బచ్చన్‌కు ఎన్నో ఏళ్లుగా అలవాటుగా వస్తోంది. తమ అభిమాన నటుడిని ఒక్కసారైనా చూడాలని, ఆయన పలకరింపును అందుకోవాలని పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ అక్కడికి చేరుకుంటారు. అయితే నవంబర్ 1న జరిగిన ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అమితాబ్ నిలబడే ఎత్తైన వేదికకు మూడు వైపులా పారదర్శకమైన రక్షణ తెరను ఏర్పాటు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దాని వెనుక నుంచే ఆయన అభిమానులకు చేతులు ఊపుతూ, రెండు చేతులు జోడించి నమస్కరించారు. భద్రతను పెంచినప్పటికీ తన అభిమానులను పలకరించే సంప్రదాయానికి మాత్రం బ్రేక్ ఇవ్వలేదు.
#AmitabhBachchan's Sunday ritual of greeting his fans gets a special touch this time as son #AbhishekBachchan arrives to receive him. ❤️ #FilmfareLens https://t.co/GPsWkxaZjb
— Filmfare (@filmfare) November 1, 2026
తండ్రి వెంటే అభిషేక్.. భద్రతపై ప్రత్యేక దృష్టి
ఈ ఆదివారం ఫ్యాన్స్ మీట్‌లో అభిషేక్ బచ్చన్ కూడా తండ్రి వెంట కనిపించారు. అమితాబ్ అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉండగా, మరోవైపు భద్రతా సిబ్బంది పరిసరాలను పర్యవేక్షించారు. తండ్రి పట్ల అభిషేక్ చూపిన శ్రద్ధకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ రక్షణ ఏర్పాట్లను అధికారిక భద్రతా సూచనల మేరకు చేశారా? లేక వ్యక్తిగత జాగ్రత్తలో భాగంగా ఏర్పాటు చేశారా? అనే విషయంపై క్లారిటీ లేదు.
జల్సాకు బాంబు బెదిరింపు.. అక్టోబర్ 23న కలకలం
అమితాబ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడానికి ప్రధాన కారణంగా ఇటీవల వచ్చిన బెదిరింపు ఈమెయిల్ వార్తల్లో నిలిచింది. అక్టోబర్ 23న ముంబై మేయర్ రీతూ తావ్డేకు పంపినట్లు చెబుతున్న ఈమెయిల్‌లో మేయర్ కార్యాలయం, అమితాబ్ నివాసం జల్సా, సింగర్ దిల్జిత్ దోసాంజ్ ముంబై సంగీత కార్యక్రమ వేదికపై బాంబు దాడులు జరగవచ్చని హెచ్చరించినట్లు అధికారులు వెల్లడించారు.
అంతేకాదు, అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 మధ్య జల్సాపై దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆ సందేశంలో పేర్కొన్నట్లు వార్తా కథనాలు తెలిపాయి. దీంతో ప్రస్తావించిన ప్రాంతాల్లో భద్రత, నిఘాను పెంచి, బెదిరింపు ఈమెయిల్ మూలాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగానే అమితాబ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది.
టైగర్ ష్రాఫ్ ఘటనతోనూ పెరిగిన ఆందోళనలు
ముంబైలో ప్రముఖుల భద్రతపై చర్చకు మరో కారణం నటుడు టైగర్ ష్రాఫ్ వాహనంపై జరిగిన కాల్పుల ఘటన. అక్టోబర్ 18న జుహు ప్రాంతంలో ఆయన ఫుట్‌బాల్ ఆట ముగించుకుని తిరిగి వస్తుండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో టైగర్ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనతో పాటు అమితాబ్ నివాసానికి వచ్చినట్లు చెబుతున్న బెదిరింపు నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖుల భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి. అయితే ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందని మాత్రం చెప్పలేం..
అభిమానులతో అనుబంధమే ముఖ్యం..
ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆదివారం దర్శనం అమితాబ్ బచ్చన్‌కు, ఆయన అభిమానులకు మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి ప్రతీక. ఈసారి మాత్రం ఆ అభిమాన పలకరింపునకు అదనపు రక్షణ తోడైంది. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచే అయినా అభిమానులకు అభివాదం చేసిన బిగ్‌బీ.. తన సంప్రదాయాన్ని కొనసాగించారు. మరోవైపు, బెదిరింపు ఈమెయిల్‌పై దర్యాప్తు కొనసాగుతుండటంతో జల్సా వద్ద భద్రతా ఏర్పాట్లు వార్తల్లో నిలుస్తున్నాయి. అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూనే భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన పరిస్థితిని ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసింది.
Mumbai, Maharashtra: Bollywood actor Amitabh Bachchan is seen greeting fans from behind a protective bulletproof glass screen. https://t.co/4gyZ8oZqVs
— IANS (@ians_india) November 1, 2026
