విశ్వక్‌సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోన్న సినిమా ‘ఈఎన్‌ఈ రిపీట్’. అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 3న విడుదల చేయనున్నట్టు అప్‌డేట్ అందించారు మేకర్స్. ఇప్పటికే విడులైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. నవంబర్ 19న సినిమా విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
