ఆప్ వైపే గోవా మొగ్గు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది: అర్వింద్ కేజ్రీవాల్

ఆప్ వైపే గోవా మొగ్గు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది: అర్వింద్ కేజ్రీవాల్

పనాజీ: గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తంచేశారు. 

మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం గోవా చేరుకున్న ఆయన.. ఎయిర్​పోర్ట్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆప్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని అన్నారు. 

ఆప్‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2027లో ఎన్నికలు జరగనున్నాయి.