మళ్లీ జైలుపాలైన ఎస్పీ నేత ఆజంఖాన్‌‌‌‌‌‌‌‌..మనీలాండరింగ్ కేసులో 14 రోజులు రిమాండ్

మళ్లీ జైలుపాలైన   ఎస్పీ నేత ఆజంఖాన్‌‌‌‌‌‌‌‌..మనీలాండరింగ్ కేసులో 14 రోజులు రిమాండ్

న్యూఢిల్లీ: సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి మొహమ్మద్ ఆజంఖాన్‌‌‌‌‌‌‌‌కు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. డ్యుయల్ పాన్ కార్డ్ (నకిలీ పాన్ కార్డ్) కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన మరునాడే, ఈడీ ఆయనను మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. 

శనివారం ఆజంఖాన్​ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రాంపూర్‌‌‌‌‌‌‌‌లోని మొహమ్మద్ అలీ జోహార్ వర్సిటీ నిర్మాణంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై ఈడీ ఈ విచారణ జరుపుతోంది.

 ఆజంఖాన్ ఆధ్వర్యంలోని మౌలానా మొహమ్మద్ అలీ జోహార్ ట్రస్ట్ ఈ యూనివర్సిటీని నిర్వహిస్తోంది. ఈ కేసుకు సంబంధించి గత అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో రూ.426.46 కోట్ల విలువైన యూనివర్సిటీ భూములు, భవనాలను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.