రంగ స్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ పడ్డాక రాంచరణ్, సుకుమార్ కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుందంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలియంది కాదు. అలాంటి సినిమా షూటింగ్ ముహూర్తం షాట్తో లాంఛనంగా మొదలైంది. అయితే.. ఈ సినిమా స్టోరీ ఏంటనే విషయంపై సుకుమార్ గానీ, రాంచరణ్ గానీ ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ.. ఈ సినిమా స్టోరీ ఇదేనని సోషల్ మీడియాలో అప్పుడే పుకార్లు షికారు చేస్తున్నాయి.
This one is extremely special. So happy to collaborate with my dearest @aryasukku garu once again ❤️ #RC17 journey begins ✨ #YouCanImagine #RC2Sukku @MythriOfficial @SukumarWritings #TSeriesFilms @RC17Offl https://t.co/ToWhOMcDv1
— Ram Charan (@AlwaysRamCharan) November 1, 2026
అలాంటి పుకార్లలో ప్రస్తుతం ఒక పుకారు ‘ఎక్స్’లో బాగా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చూస్తుంటే.. గుజరాతీ సూపర్ హిట్ సినిమా 'లాలో.. కృష్ణ సదా సహాయతే’ సినిమా రీమేక్లా అనిపిస్తుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. రాంచరణ్, సుకుమార్ కొత్త సినిమా పోస్టర్ చూస్తుంటే కృష్ణుడి పాత్రలో రాంచరణ్ కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
►ALSO READ | OTT New Movies: ఓటీటీలోకి వచ్చిన 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
గుజరాతీ సినిమా ‘లాలో’లో కూడా కృష్ణుడి పాత్ర సినిమాకే హైలైట్. ఈ సినిమా రీమేక్లో రాంచరణ్ కృష్ణుడి పాత్రలో నటించనున్నాడని గతంలో వార్తలు కూడా వచ్చాయి. సుకుమార్, రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ అనుమానాలను మరింత బలపడేలా చేసింది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన గుజరాతీ సినిమా 'లాలో' బాక్సాఫీస్ దగ్గర రూ. 122 కోట్లకు పైగా వసూలు చేసి సినీ విమర్శకులను విస్తుపోయేలా చేసింది.
Is RC17 is based on Laalo with Ram Charan playing Lord Krishna's role and Rishikant playing Laalo's role ? https://t.co/KK6UbfXzUw
— ®|$#! (@SkyStar04510789) November 1, 2026
రూ. 100 కోట్ల మార్కును దాటిన తొలి గుజరాతీ సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే.. రాంచరణ్, సుకుమార్ రెండో సినిమాకు ఈ సినిమా ప్రేరణగా నిలిచిందో లేక సుక్కూ రాసుకున్న కథ పూర్తిగా కొత్తదో తెలియాలంటే ‘పుష్ప’ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేంత వరకూ వేచి ఉండక తప్పదు.
