బాలీవుడ్కు బిష్ణోయ్ గ్యాంగ్ భయం.. బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ వెనుక నుంచే ఫ్యాన్స్కు అమితాబ్ హాయ్ !

బాలీవుడ్కు బిష్ణోయ్ గ్యాంగ్ భయం.. బుల్లెట్ ఫ్రూఫ్ షీల్డ్ వెనుక నుంచే ఫ్యాన్స్కు అమితాబ్ హాయ్ !

బాలీవుడ్కు బిష్ణోయ్ గ్యాంగ్ భయం పట్టుకుంది. టైగర్ ష్రాఫ్పై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడిన బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రాణ భయంతో ముందు జాగ్రత్త చర్యలతో వార్తల్లో నిలిచారు. ఎందుకంటే.. తుపాకీ గుండ్లు దిగినా బతికి బట్టకట్టడానికి జీవితం సినిమా కాదుగా. అందుకే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉంటున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆయనకు వీలైనప్పుడల్లా ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తుంటారు.

బిగ్ బీ ఇంటి ముందు అభిమానులు ఈ క్షణాల కోసం పడిగాపులు కాస్తుంటారు. గతంలో అమితాబ్ దర్జాగా బయటకు వచ్చి గేటు దగ్గర నుంచి అభిమానులకు హాయ్ చెప్పి వెళ్లిపోయే వారు. కానీ.. ఈ ఆదివారం తన అభిమానులను అమితాబ్ పలకరించిన తీరు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

ఒక రక్షణ కవచం లాంటి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ షీల్డ్ వెనుక అమితాబ్ బచ్చన్ అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. బాలీవుడ్ సెలబ్రెటీలను బిష్ణోయ్ గ్యాంగ్ ఎంతలా వణికిస్తుందో ఈ పరిణామం చెప్పకనే చెబుతోంది. అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ గురించి ముంబై పోలీసులకు ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) ఏరియాలోని ఒక స్కూల్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులు ఈ బాంబు బెదిరింపుపై విచారణ జరుపుతున్నారు.