మీ మాక్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లోనే ప్రధాని అయిపోండి..రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు

మీ మాక్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లోనే ప్రధాని అయిపోండి..రాహుల్ గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు
  •  పంజాబ్​లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా​ 

చండీగఢ్‌‌‌‌‌‌‌‌: పంజాబ్​లో 2027 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్​హీట్​పెరుగుతోంది. ఆదివారం చండీగఢ్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సభలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్​షా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ చెబుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్‌‌‌‌‌‌‌‌’లో ప్రేమకు బదులు ద్వేషమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. 

ప్రధాని కావాలన్న ఆశతోనే రాహుల్ మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ జీ.. మీ బూటకపు పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో మీరే ప్రధానిగా కొనసాగండి. కానీ దేశానికి ప్రధాని కావాలన్న మీ కల మాత్రం నెరవేరదు’ అని వ్యాఖ్యానించారు. 

ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఒక్క సీటు కూడా గెలవలేదన్నారు. రాబోయే మూడు ఎన్నికల్లోనూ ఖాతా తెరవదని, మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. పండుగల సమయంలో ర్యాలీలు నిర్వహించొద్దని ఢిల్లీ వ్యాపారులు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను కోరిన విషయాన్ని ప్రస్తావించారు. 

పంజాబ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ ఈసారి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2029 డిసెంబర్ 31 నాటికి రాష్ట్రాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆప్ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. బీజేపీ కూడా డ్రగ్స్ నియంత్రణ, పాలన అంశాలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకుంటోంది.