పొయెట్రీ కార్నర్ : కరువు కాటేసిన కాలం..కన్నీటికి మూలాధారం

పొయెట్రీ కార్నర్ : కరువు కాటేసిన కాలం..కన్నీటికి మూలాధారం

ఓ జీవితాన..
ఆశలు ఎన్నో
శ్వాసలు ఎన్నో
మాటలు ఎన్నో
మాయలు ఎన్నో
ఆశయాలు ఎన్నో
పరిచయాలు ఎన్నో
జ్ఞాపకాలు ఎన్నో
సుఖాలు ఎన్నో
కష్టాలు ఎన్నో
కానీ..
పుట్టిన రోజు ఒకటే
గిట్టిన రోజు ఒకటే! 

కరువు కాటేసిన కాలం..
కన్నీటికి మూలాధారం..
కాపాడుటయే భవిష్యత్తుకి ఆధారం..
ప్లాస్టిక్​ని వాడకాన్ని తగ్గిద్దాం..
నీటిని, వాతావరణాన్ని 
రక్షించుకుందాం..
కరోన కాలంలో నేర్చుకున్నాం..
కాపాడమని వెడుకున్నాం
అయిన మనం మారకున్నాం..
ఆస్తులు సంపాదించుకున్నాం
అవసరానికి మించి వాడేస్తున్నాం..
ఆహారాన్ని వృథాగా పడేస్తున్నాం..
కనీసం ఆరోగ్యాన్ని 
కాపాడుకోలేకున్నాం..
ఇంకా ఏదో ఆలోచిస్తున్నాం..!