కుమ్మరి సారె పై
పచ్చి మట్టిముద్ద గుండ్రంగా తిరుగుతూ తిరుగుతూ
ప్రమిదగా మారింది!
చిత్రం!
ఊరకే లేదు.. నిండా నూనె నింపుకుని
వత్తి వెలిగించుకుని
దీప ప్రమిదగా పండగ చేస్తోంది!
మట్టి తన బంగారు కలను దీపంగా మార్చుకుంది!
చిన్ని ప్రమిదది పెద్ధ పాత్రే మరి!
అందరి నోట చిన్ని ప్రమిద మాటే!
- కందాళై రాఘవాచార్య
