నవంబర్ 1న పెరిగిన గోల్డ్.. దీపావళి షాపర్స్ లేటు చేయెుద్దు: హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

నవంబర్ 1న పెరిగిన గోల్డ్.. దీపావళి షాపర్స్ లేటు చేయెుద్దు: హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

గత నెల చివరి వారంలో అనూహ్యంగా పతనం అయిన బంగారం, వెండి రేట్లు మళ్లీ నవంబర్ మాసంలో తిరిగి పుంజుకుంటున్నాయి. దీంతో దీపావళికి షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వారికి రేట్లు భారంగా మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రస్తుతం షాపింగ్ చేయాలని అనుకుంటున్నట్లయితే సోమవారం రోజున తమ సమీప నగరాల్లో మారిన రిటైల్ గోల్డ్ అండ్ సిల్వర్ విక్రయ ధరలను పరిశీలించటం బెటర్. 

నవంబర్ 2న బంగారం రేట్లు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు నవంబర్ 1 కంటే రూ.49 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.13వేల 937గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 775గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. నవంబర్ 2, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కూడా స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.2లక్షలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.200 దగ్గర ఉంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న మరికొద్ది రోజుల్లో వెండి ఇంకా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కె్ట్ వర్గాలు చెబుతున్నాయి.