ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లాభం 33శాతం అప్‌‌‌‌‌‌‌‌

ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ లాభం 33శాతం అప్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన రెండో క్వార్టర్ (క్యూ2) లో మెరుగైన ఫలితాలను సాధించింది. జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే కంపెనీ నికర లాభం  32.7శాతం పెరిగి రూ.10.5 కోట్లకు చేరింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ మొత్తం లాభం రూ.18.4 కోట్లుగా నమోదైంది. క్వార్టర్ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం క్యూ2లో 9శాతం వృద్ధితో రూ.196.1 కోట్లకు చేరగా, ఆరు నెలల మొత్తం ఆదాయం రూ.376 కోట్లను తాకింది. కంపెనీ నిర్దేశించుకున్న రూ.750 కోట్ల వార్షిక లక్ష్యంలో ఇప్పటికే 50శాతం సాధించింది.  ఇబిటా 67.4శాతం పెరిగి రూ.41.4 కోట్లకు చేరింది.