మరోసారి పెరిగిన హోటల్, రెస్టారెంట్ సిలిండర్ ధరలు 

మరోసారి పెరిగిన హోటల్, రెస్టారెంట్ సిలిండర్ ధరలు 

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో ధరల పెరుగుదలకు అనుగుణంగా దేశీయంగా  కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను చమురు సంస్థలు ఆదివారం పెంచాయి.  హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.10 పెరిగింది. దీంతో దీని ధర రూ.2,820కి చేరింది. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం. 

ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న రూ.62.50, సెప్టెంబర్ 1 న రూ.9.50 ను ఆయిల్ కంపెనీలు  పెంచాయి.  అయితే సామాన్యులకు ఊరటనిస్తూ ఇళ్లలో వాడే 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.942 వద్దే యథాతథంగా ఉంచారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. మరోవైపు  ఏటీఎఫ్ లీటరు ధరపై రూ.1.37 పెరగడంతో కొత్త ధర రూ.138.50కి చేరింది. 

విమాన ఇంధన ధరలు వరుసగా పెరగడం ఇది నాలుగో నెల. అక్టోబర్ 1 న లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.16 పెరిగింది. ఏటీఎఫ్ ధరలు పెరగడంతో  విమానయాన సంస్థల మొత్తం ఆపరేటింగ్‌‌‌‌‌‌‌‌ ఖర్చుల్లో ఇంధనానికే దాదాపు 40 శాతం ఖర్చవుతోంది. తాజా పెంపు విమాన సంస్థలపై అదనపు భారాన్ని మోపనుంది. అంతర్జాతీయ చమురు ధరలు, రూపాయి–డాలర్ మారకం విలువల ఆధారంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన 
ఈ ధరలను సమీక్షిస్తాయి.