పండుగల జోరుతో జీఎస్టీ రికార్డు వసూళ్లు.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో రూ.2.31 లక్షల కోట్లు

పండుగల జోరుతో జీఎస్టీ రికార్డు వసూళ్లు.. అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో రూ.2.31 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తగా అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త గరిష్టాలకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 23 శాతం వృద్ధితో రూ.2.31 లక్షల కోట్లకు పైగా గ్రాస్‌‌‌‌‌‌‌‌ జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం వెల్లడించింది. జీఎస్టీ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక నెలవారీ వసూలు కాగా, వరుసగా రెండో నెల కూడా రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం విశేషం. 

ఏప్రిల్ నెలలో నమోదైన రూ.2.43 లక్షల కోట్ల రికార్డు తర్వాత ఇదే అతిపెద్ద వసూలు. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ 16 శాతం పెరిగి రూ.1.59 లక్షల కోట్లకు చేరగా, దిగుమతులపై పన్నులు 42 శాతం ఎగబాకి రూ.72,246 కోట్లకు చేరాయి.  మొత్తం రూ.2.31 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.42,935 కోట్లు, ఎస్‌‌‌‌‌‌‌‌జీఎస్టీ రూ.51,340 కోట్లు కాగా, ఐజీఎస్టీ  రూపంలో అత్యధికంగా రూ.1.37 లక్షల కోట్లు 
వసూలయ్యాయి.

రీఫండ్లు రూ.27,934 కోట్లు

రీఫండ్ల రూపంలో ఇచ్చిన రూ.27,934 కోట్లను మినహాయిస్తే, నికర జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరిగి రూ.2.03 లక్షల కోట్లకు చేరాయి. ఏప్రిల్–-అక్టోబర్ మధ్య మొత్తం గ్రాస్‌‌‌‌‌‌‌‌ వసూళ్లు రూ.14.77 లక్షల కోట్లు దాటాయి. పండుగల డిమాండ్‌‌‌‌‌‌‌‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, యూపీ వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, జీఎస్టీ 2.0 సంస్కరణలతో పన్ను ఎగవేతలు తగ్గి నిబంధనల పాటించడం (కంప్లయన్స్) పెరగడమే ఈ రికార్డు వృద్ధికి కారణమని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషించారు.