‘కొమరం భీమ్‌‌‌‌ ’ స్ఫూర్తితో ముందుకుసాగాలి..బజార్‌‌‌‌ హత్నూర్‌ ‌‌‌లో కొమరం భీమ్‌‌‌‌ విగ్రహావిష్కరణ:ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్

‘కొమరం భీమ్‌‌‌‌ ’ స్ఫూర్తితో ముందుకుసాగాలి..బజార్‌‌‌‌ హత్నూర్‌ ‌‌‌లో కొమరం భీమ్‌‌‌‌ విగ్రహావిష్కరణ:ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్

​బజార్‌‌‌‌ హత్నూర్‌‌‌‌, వెలుగు : గిరిజనులలో హక్కుల చైతన్యాన్ని నింపి, ‘జల్‌‌‌‌-జంగల్‌‌‌‌-జమీన్‌‌‌‌’ నినాదంతో పోరాడిన అమరవీరుడు కుమరం భీమ్‌‌‌‌ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆదిలాబాద్‌‌‌‌ ఎంపీ గోడం నగేశ్​ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల కేంద్రంలో కొత్తగా  ఏర్పాటు చేసిన కొమరం భీమ్‌‌‌‌ విగ్రహాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.

 వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీలు గుస్సాడీ వేషధారణతో, సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి కొమురం భీమ్ అమరత్వమే నిదర్శనమని కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌‌‌‌ సభ్యుడు తాటిపల్లి గంగాధర్‌‌‌‌ రావు, మాజీ రైల్వే బోర్డు సభ్యుడు గుండ్ల వెంకటరమణ, సర్పంచ్ లు సాయన్న, జలై జాకు, నాయకులు మెస్రం జంగు బాబు, అల్కా గణేశ్, పీఏసీఎస్​ చైర్మన్‌‌‌‌ వెంకన్న, మాజీ జడ్పీటీసీ కొత్త శంకర్ తదితరులు పాల్గొన్నారు.