విశాఖలోని రుషికొండ తీరానికి సమీపంలో ఓ బోటు కొట్టుకొచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు పరిశీలించారు.వరుస తుఫాన్ల ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి పెరగడం వల్లే ఈ బోటు తీరానికి కొట్టుకొచ్చి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.
గతంలో తుఫాను వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేది సమీపంలో ఓ సల్ఫర్ కార్గో నౌక తీరానికి కొట్టుకొచ్చింది. ఇప్పుడు రుషికొండ సమీపంలో మరో బోటు తీరానికి చేరడంతో సముద్రంలో తుఫాన్ల ప్రభావంపై చర్చ జరుగుతోంది.అయితే రుషికొండకు కొట్టుకొచ్చిన బోటు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అధికారులు పరిశీలించి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
