దీపావళికి సూర్య ‘సీన్’ సందడి.. నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల 

దీపావళికి సూర్య ‘సీన్’ సందడి.. నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో విడుదల 

కోలీవుడ్  స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం  ‘సీన్’.  ‘ఆవేశం’ ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించగా, సూర్య, జ్యోతిక నిర్మించారు. దీపావళి కానుకగా  నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో  సినిమా  విడుదల కానుంది. తాజాగా తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.   క్రైమ్, యాక్షన్, డార్క్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.  ఇందులో సూర్య డీఎస్పీ  పాత్రలో కనిపిస్తున్నాడు.

అయితే ఓ దశలో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకుంటాడు.  కానీ అదే సమయంలో ఓ ప్రమాదకరమైన నేరస్థుడిని పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ క్రమంలో సూర్యకు, నస్లేన్ పోషించిన క్రిమినల్ పాత్రకు మధ్య జరిగే పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది.  మరోవైపు నజ్రియా నజీమ్ మాయ పాత్రలో కనిపిస్తుంది.  

తొలుత పనిమనిషిగా పరిచయమైన ఆమె.. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలతోనూ  ఆకట్టుకుంది. ఈ చిత్రం  ఎన్వీఆర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో విడుదల  కానుంది.