దీపావళి పండుగ మరో కొద్ది రోజుల్లో రాబోతుంది. దీపావళి ముందు నరక చతుర్థశిని జరుపుకుంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం కొంతమంది నరకచతుర్ధశి( 2026 నవంబర్7) హనుమంతుడిని పూజిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయుడిని పూజించిన వారికి బలం, ధైర్యం కలగడమే కాకుండా .. ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్ 7 వ తేదీన హనుమంతుడిని పూజించేందుకు శుభ ముహూర్తం.. పూజా విధానం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
పూర్వీకుల నమ్మకాల ప్రకారం ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్ధశి రోజు దుష్టశక్తులు, ప్రతికూల శక్తులు, చెడు భావనలు గరిష్టస్థాయిలో ఉంటాయి. అంతే కాదు ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇలాంటి వాటిని తొలగించుకొనేందుకు నరకచతుర్ధశి రోజు హనుమంతుడిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
నరకచతుర్దశి ఎప్పుడు
నరకచతుర్ధశి : 2026 నవంబర్ 7
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్దశి ప్రారంభం: నవంబర్7 ఉదయం 10 గంటల 47 నిమిషాలకు
ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం చతుర్దశి ముగింపు : నవంబర్8 ఉదయం 11 గంటల 27 నిమిషాలకు
చతుర్దశి తిథి నవంబర్ 7న ఉదయం 10:47 గంటలకు ప్రారంభమై నవంబర్ 8న ఉదయం 11:27 . దీపాల పండుగ దీపావళి: నవంబర్ 8, ఆదివారం
హనుమాన్ పూజ శుభముహూర్తం
చెడు శక్తులు, ప్రతికూల శక్తులు ఎక్కువుగా రాత్రిసమయాల్లో ప్రభావితం కలిగి ఉంటాయి. అందుకే ప్రతి కూల శక్తులను తొలగించేందుకు రాత్రి సమయాల్లో పూజలు చేస్తుంటారు. ఆశ్వయుజమాసం కృష్ణ పక్షం చతుర్థశి తిథి ఘడియలు నవంబర్ 7 రాత్రి సమయంలో ఉన్నాయి.
ఈ ఏడాది ( 2026) నరకచతుర్దశి రోజు నవంబర్ 7న హనుమాన్ పూజ చేయడానికి అనువైన సమయం కేవలం 52 నిమిషాలు మాత్రమే ఉందని పండితులు చెబుతున్నారు, . నవంబర్ 7 రాత్రి 11:39 గంటల నుండి నవంబర్ 8 తెల్లవారుజామున 12:31 గంటల మధ్య హనుమంతుదిని పూజించేందుకు శుభ ముహూర్తమని పండితులు చెబుతున్నారు.
రామాయణం ప్రకారం లంకలో రావణ సంహారం తర్వాత రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వస్తున్నారు. వాయు వేగంతో అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు ఈ విషయాన్ని భరతుడికి, అయోధ్య ప్రజలకు శ్రీరాముని రాక గురించి తెలియజేశారు. దీంతో పాటు హనుమంతుడి అపారమైన భక్తి, సేవకు ముగ్దుడైన శ్రీరాముడు అన్ని పూజల్లో హనుమంతుడినే ముందుగా పూజించాలని చెప్పారు. ఈ కారణంగానే దీపావళికి ఒక రోజు ముందుగా హనుమంతుడిని పూజిస్తారు.
పూజా విధానం
- నరక చతుర్దశి రోజు హనుమంతుడిని పూజించేటప్పుడు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో కలిపిన చందనం లేదా సింధూరంతో స్వామివారిని అలంకరించాలి.
- హనుమంతుడి విగ్రహం లేదా చిత్ర పటాన్ని తూర్పు వైపునకు అభిముఖంగా ఉంచండి.
- అంజనేయస్వామి ముందు నువ్వుల నూనెతో గాని లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
- తమలపాకుల మాల లేదా వడమాల సమర్పించాలి.
- ఆంజనేయుడికి ఇష్టమైన ఎర్రని పూలు, సింధూరం, బెల్లం సమర్పించండి.
- హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం పఠించాలి.
- రామయణంలోని సుందరకాండ పఠించడం చాలా మంచిది.
హనుమంతుడికి నియమనిష్టలతో పూజించడం వల్ల విఘ్నాలు తొలగుతాయి. దీపావళి పర్వదినాన లక్ష్మీదేవి రావడానికి సరైన వాతావరణం ఏర్పడుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇలా నరకచతుర్దశి రోజున ఆంజేయ స్వామిని పూజించడం వలన ఐశ్వర్యం, విజయం లభిస్తాయని పండితులు చెబుతున్నారు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
