Jailer 2 Records: రికార్డులన్నీ ఖతం.. రూ.800 కోట్ల క్లబ్‌లో జైలర్ 2.. తమిళ సినీ చరిత్రలో తలైవా కొత్త అధ్యాయం!

Jailer 2 Records: రికార్డులన్నీ ఖతం.. రూ.800 కోట్ల క్లబ్‌లో జైలర్ 2.. తమిళ సినీ చరిత్రలో తలైవా కొత్త అధ్యాయం!

సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన రేంజ్ ఏంటో చూపించారు. తలైవా మాస్ స్వాగ్‌కు కలెక్షన్లు ఫిదా అవుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.807.25 కోట్ల గ్రాస్ వసూళ్లతో రూ.800 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒకవైపు ఇండియాలో తన పాత రికార్డులనే బద్దలు కొడుతూ.. మరోవైపు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తలైవా తన బాక్సాఫీస్ పవర్‌ను మరోసారి చాటుకున్నారు.

18 రోజుల్లో రూ.807 కోట్లు.. బాక్సాఫీస్ దగ్గర జైలర్ జాతర

అక్టోబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’కు మొదటి రోజు నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజే ఇండియాలో రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లు సాధించి అదిరిపోయే ఓపెనింగ్ అందుకుంది. మొదటి వారంలోనే రూ.334.35 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టి తన జోరు చూపించింది. అయితే రెండో వారంలో వసూళ్లు కాస్త డౌన్ అయినా.. మూడో వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. 17వ రోజు రూ.9.70 కోట్లు, 18వ రోజు రూ.11.20 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో 18 రోజుల్లో ఇండియాలో రూ.456.30 కోట్ల నెట్, రూ.533.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి రూ.273.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడంతో వరల్డ్‌వైడ్ టోటల్ రూ.807.25 కోట్లకు చేరింది. అంటే మూడు వారాలు కూడా పూర్తికాకుండానే ‘జైలర్ 2’ రూ.800 కోట్ల మార్కును దాటేసి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

‘2.0’ రికార్డు బద్దలు.. తలైవా రేంజ్ ఇదే

ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రజనీకాంత్ నటించిన ‘2.0’ నిలిచింది. 2018లో వచ్చిన ఈ సినిమా లైఫ్‌టైమ్ ఇండియా గ్రాస్ రూ.519 కోట్లు. అయితే ‘జైలర్ 2’ కేవలం 17 రోజుల్లోనే రూ.520.35 కోట్ల గ్రాస్ సాధించి ఆ రికార్డును బ్రేక్ చేసింది. 18వ రోజు కలెక్షన్లతో ఈ ఫిగర్ రూ.533.75 కోట్లకు చేరింది.

ALSO READ : Ranabaali OTT: థియేటర్లలో రన్ కొనసాగుతుండగానే.. ఓటీటీలోకి రణబాలి..!

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ‘2.0’కు హిందీ మార్కెట్ భారీగా కలిసొచ్చింది. అక్షయ్ కుమార్ క్రేజ్‌తో పాటు నార్త్ ఇండియాలో విస్తృతంగా విడుదల కావడంతో హిందీ వెర్షన్ నుంచే రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కానీ ‘జైలర్ 2’ హిందీ వెర్షన్‌కు PVR INOX, Cinepolis వంటి ప్రధాన మల్టీప్లెక్స్ చైన్లలో విడుదల పరంగా సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ దక్షిణాది మార్కెట్లలో వచ్చిన సాలిడ్ వసూళ్లతో రజనీ తన రికార్డును తానే బద్దలు కొట్టడం విశేషం.

నాలుగు దక్షిణాది మార్కెట్లలోనూ సత్తా..

‘జైలర్ 2’ మాస్ జోరు తమిళనాడుకే పరిమితం కాలేదు. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలోనూ అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. నాలుగు ప్రధాన దక్షిణాది మార్కెట్లలో ఒక్కో ప్రాంతం నుంచి రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ఈ చిత్రం నిలిచిందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి.

తమిళనాడు – రూ.210.45 కోట్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – రూ.94.95 కోట్లు

కర్ణాటక – రూ.92.20 కోట్లు

కేరళ – రూ.77.70 కోట్లు

మిగిలిన భారతదేశం – రూ.58.45 కోట్లు

ఈ లెక్కలు చూస్తుంటే తలైవాకు సౌత్ ఇండియాలో ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు రూ.95 కోట్ల గ్రాస్ సాధించడం రజనీకాంత్ పాన్ ఇండియా మార్కెట్ స్టామినాకు నిదర్శనం.

రూ.1000 కోట్ల క్లబ్‌పై కన్నేసిన టైగర్..

ఇప్పటికే రూ.807.25 కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘జైలర్ 2’ ఇప్పుడు రూ.1000 కోట్ల క్లబ్‌పై కన్నేసింది. ఆ మార్కును అందుకోవాలంటే మరో రూ.192.75 కోట్లు రాబట్టాలి. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణ్యం సైతం ఈ సినిమా రూ.1000 కోట్ల వరల్డ్‌వైడ్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ టార్గెట్‌ను అందుకోవడం అంత ఈజీ కాదు. నవంబర్ 5న రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’ థియేటర్లలోకి రానుంది. దీంతో ‘జైలర్ 2’కు స్క్రీన్ల పరంగా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ పోటీని తట్టుకుని తలైవా రూ.1000 కోట్ల మార్కును అందుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

తలైవా స్వాగ్‌కు బాక్సాఫీస్ సలాం

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్, రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రమ్యకృష్ణ, యోగిబాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మొత్తానికి వయసు పెరుగుతున్నా తలైవా బాక్సాఫీస్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదని ‘జైలర్ 2’ మరోసారి నిరూపించింది. తన గత రికార్డులనే తానే తిరగరాస్తూ తమిళ సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు అందరి చూపు రూ.1000 కోట్ల మార్కుపైనే. టైగర్ ముత్తువేల్ పాండియన్ ఆ మైలురాయిని కూడా టచ్ చేస్తాడా? వెయిట్ అండ్ సీ..