విక్టరీ వెంకటేశ్ మరోసారి తనదైన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా.. వీకెండ్‌లో రోజురోజుకూ వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఆదివారం కలెక్షన్లు మరింత పెరగడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లు మేకర్స్ ప్రకటించడం విశేషం. దీంతో వెంకటేశ్ అభిమానుల్లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
#AadarshaKutumbam grosses 75CR+ worldwide in just 3 days! 🔥💥 The BLOCKBUSTER family entertainer continues to win hearts and receive phenomenal love from audiences everywhere! 😍❤️🔥 Book your tickets for #AK47 Now! 🎟️ https://t.co/VZv15xvgie 🎟️ https://t.co/H1aDsnYEcY Victory @VenkyMama #Trivikram @SrinidhiShetty7 @IamRohithNara @MusicThaman @Nivetha_Tweets @DimpleHayathi #UdbayBhirSandhu #YuvinaParthavi #RajaPrajwal #SRadhaKrishna @vamsi84 @dop007 @NavinNooli #AsPrakash @kevinkumarrrr @nikhilkoduru @haarikahassine @adityamusic
— Haarika & Hassine Creations (@haarikahassine) November 2, 2026
వెంకీ మామకు వీకెండ్ కలిసొచ్చిందిగా..
‘ఆదర్శ కుటుంబం’ తొలి రోజు ఇండియాలో రూ.9.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో రోజు శనివారం ఈ కలెక్షన్లు మరింత పెరిగాయి. ఏకంగా రూ.10.40 కోట్ల నెట్ వసూళ్లతో తొలి రోజుతో పోలిస్తే 6.7 శాతం గ్రోత్ నమోదు చేసింది. ఇక ఆదివారం అయితే సినిమా మరింత జోరు చూపించింది. మూడో రోజు రూ.11.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, శనివారంతో పోలిస్తే మరో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇలా తొలి రోజు నుంచి మూడో రోజు వరకు వరుసగా కలెక్షన్లు పెరుగుతుండటం సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు కాగా, ఇండియాలో మొత్తం నెట్ కలెక్షన్లు రూ.32 కోట్లు, గ్రాస్ వసూళ్లు రూ.38.29 కోట్లకు చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా..
ఓవర్సీస్‌లోనూ ‘ఆదర్శ కుటుంబం’కు మంచి ఆదరణ లభిస్తోంది. సాక్నిల్క్ ట్రాకింగ్ ప్రకారం తొలి మూడు రోజుల్లో విదేశాల నుంచి సుమారు రూ.14.10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలిపి మూడో రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించినట్లు ప్రకటించింది. ఏదేమైనా వెంకటేశ్ సినిమాకు తొలి వీకెండ్‌లో మంచి బాక్సాఫీస్ మద్దతు లభించింది.
వెంకటేశ్ నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా..
ఈ సినిమాలో వెంకటేశ్ తనదైన శైలిలో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్‌తో అలరించారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయన కనిపించిన తీరు, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఫస్టాఫ్ లోని ఫ్యామిలీ ఎపిసోడ్స్‌కు మంచి స్పందన వస్తోంది. కథలోని కొన్ని లోపాలు, ద్వితీయార్థంలోని నెమ్మదైన కథనం గురించి విమర్శలు వినిపిస్తున్నప్పటికీ వెంకీ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
►ALSO READ | King First Song: షారుఖ్ బర్త్‌డే స్పెషల్ ట్రీట్.. 'కింగ్' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్!
శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా, సత్య తన కామెడీతో అలరించారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. త్రివిక్రమ్ తనదైన కుటుంబ వినోదాన్ని, క్రైమ్ డ్రామాను కలిపి ఈ సినిమాను తెరకెక్కించారు.
సోమవారం కూడా నిలబడితే మరింత బలమైన రన్..
సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం సినిమాల వసూళ్లు తగ్గుతుంటాయి. కానీ ‘ఆదర్శ కుటుంబం’కు తొలి మూడు రోజుల్లో కలెక్షన్లు క్రమంగా పెరగడం ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు సోమవారం వసూళ్లు ఎలా ముగుస్తాయన్నది కీలకంగా మారింది. వీక్‌డేస్‌లోనూ ఇదే స్థాయి ప్రేక్షకాదరణ కొనసాగితే సినిమా బాక్సాఫీస్ రన్ మరింత బలపడే అవకాశం ఉంది.
మొత్తానికి వెంకీ మామ తన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి పోరాటమే చేస్తున్నారు. తొలి మూడు రోజుల్లో పెరుగుతూ వచ్చిన కలెక్షన్లు, నాలుగో రోజు నుంచి ఎలాంటి ట్రెండ్‌ను చూపిస్తాయో చూడాలి. రాబోయే రోజుల్లో ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ల ప్రయాణం మరింత ఆసక్తికరంగా మారనుంది.
