దీపావళి పండుగకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఢిల్లీ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సూచించింది. పండుగ 2026 నవంబర్ 8న ఉండటంతో ఆ ముందు రోజైన, పండుగ రోజు 8న పర్యావరణ రహిత పటాకులను వెలిగించుకోవచ్చునని పేర్కొంది. పండుగ మరుసటి రోజైన 9 తేదీ నుంచి పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు ఆదేశించింది.
జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ ప్రసన్న బి వరాలే లతో కూడిన బెంచ్.. 7,8 తేదీలలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఒక గంట.. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు రెండు గంటలు కాల్చుకోవచ్చునని పేర్కొంది.
బేరియం మూలకం ఉన్న పటాకులు అదేవిధంగా CSIR-NEERI అనుమతించని పటాకులు గ్రీన్ క్రాకర్స్ కావని.. వాటిని వినియోగించడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది.
పటాకులు కాల్చేందుకు నిబంధనలు:
పటాకులు కాల్చేందుకు సుప్రీం కోర్టు కొన్ని నిబంధనలు విధించింది. ఆసుపత్రులకు 300 మీటర్ల లోపు క్రాకర్స్ కాల్చొద్దని చెప్పింది. వీటితో పాటు నర్సింగ్ హోమ్స్, ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాలు, ఓల్డేజ్ హోమ్స్, సైలెన్స్ జోన్స్ కు కూడా 300 మీటర్ల లోపు కాల్చితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
ఢిల్లీ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యంపై సుమోటోగా ఒక పిటిషన్, పటాకులపై బ్యాన్ విధించడంపై ఒక పటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా.. సుప్రీం కోర్టు ఈ సూచనలు చేసింది.
