కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ అయ్యారు . సోమవారం (నవంబర్ 2, 2026) న్యూఢిల్లీలో లాలూ కుమార్తె మీసా భారతి నివాసంలో ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి సోనియా గాంధీ అడిగి తెలుసుకున్నారు. యూపీఏ (UPA) హయాంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఎంజీఎన్‌రేగా (MGNREGA) వంటి సంక్షేమ పథకాలతో పాటు విద్యాహక్కు చట్టం (RTE), సమాచార హక్కు చట్టం(RTI) వంటి చట్టాల గురించి చర్చించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో బీహార్‌కు కేటాయించిన అభివృద్ధి నిధులను ఇద్దరు నేతలు గుర్తుచేసుకున్నారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్..ఎయిమ్స్ లో చికిత్స కోసం ఢిల్లీలో ఉంటున్నారు. ఇద్దరు నేతల భేటీ సందర్భంగా.. యూపీఏ ప్రభుత్వం 2004-14 వరకు జరిగిన అభివృద్ధిపై చర్చించినట్లు ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ ఎక్స్ లో షేర్ చేశారు.
యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బీహార్ అభివృద్దికి 145 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుల గురించి పేర్కొన్నారు.
आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री @laluprasadrjd जी से आदरणीय श्रीमती सोनिया गांधी जी ने मुलाक़ात की। देश के दो सबसे अनुभवी नेताओं की यह मुलाकात पारिवारिक व आत्मीय रही। दोनों लंबे समय से एक दूसरे के सुख-दुख में मजबूती से एक साथ खड़े रहे है। UPA की विकास गाथा पर उनके संघर्ष, संस्मरण, चिंतन और उपलब्धियों को सुनना और उससे सीखना मेरा सौभाग्य है। उनसे प्रेरणा मिलती है कि दृढ़ संकल्प और सही दिशा में की गई मेहनत हमेशा सकारात्मक परिणाम देती है।
— Tejashwi Yadav (@yadavtejashwi) November 2, 2026
