తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్గా గడ్డమీది రాజు

తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రెసిడెంట్గా గడ్డమీది రాజు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా గడ్డమీది రాజు, ఉపాధ్యక్షుడు వరుణ్ యాదవ్, జనరల్ సెక్రటరీలుగా ఉప్పల్ శేఖర్ గౌడ్, నెల్లుట్ల శేఖర్, నాగరాజు, అలీ భాయ్, ఖాజావల్లి శ్రీశైలం, సిద్దిపేట శ్రీశైలం, చందు రామంతపూర్, భువనగిరి జాంగిర్ బాయ్ ఎన్నికయ్యారు. జిల్లాల వారీగా కమిటీలను త్వరలోనే ఎన్నుకుంటామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

తెలంగాణలో చికెన్ షాప్ వ్యవస్థ మీద ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ నష్టం కలిగే విధంగా కార్పొరేట్ వ్యవస్థలు అనుసరించే విధానాన్ని ఎండగడతామని కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. రాబోయే రోజులలో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క చికెన్ షాప్ సభ్యుడిని చైతన్యపరిచే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క చికెన్ షాప్ కార్మి్కుడి జీవితాలలో వెలుగులు నింపేలాగా పనిచేస్తామని రాష్ట్ర కమిటీ సభ్యులు చెప్పారు.