మోడీని గద్దె దించుతేనే ప్రజాస్వామ్యం సేఫ్.. బీజేపీపై ఖర్గే ఫైర్

మోడీని గద్దె దించుతేనే ప్రజాస్వామ్యం సేఫ్.. బీజేపీపై ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: విపక్షాలను భయపెట్టేందుకు బీజేపీ గతంలో  సీబీఐ, ఈడీ, ఐటీని ఉపయోగించేంది.. కానీ ఇప్పుడు సీబీఐ, ఈడీతో పని జరగడం లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వాడుకుంటున్నారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మింటో రోడ్ నుంచి మొదలై, కన్నాట్ ప్లేస్ మీదుగా రామ్‌లీలా మైదానం వరకు మార్చ్ కొనసాగింది. 

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఈ మార్చ్‎లో పాల్గొన్నారు. అనంతరం రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై దేశంలో ఓట్ చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు.

 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఈసీ బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తుందన్నారు. సీఈసీని అడ్డుకుపెట్టుకుని బీజేపీ పలు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‎ను మోడీ, అమిత్ షా కాపాడుతున్నారని అన్నారు.

►ALSO READ | పంజాబ్‎లో ఎన్నికల వేళ ఆప్‎కు బిగ్ షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా

 ఒక్క జ్ఞానేష్ కుమార్ కోసం ఎంతో మందిని జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఈసీ తీరుతో దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యంగం ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రధాని మోడీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఓట్ చోరీకి పాల్పడుతోన్న సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌ను తొలగించాల్సిందేనని.. అప్పటివరకు మా ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.